జగన్ పాలనతోనే స్వర్ణయుగం

11 Nov, 2013 03:23 IST|Sakshi
లింగంపేట (లక్కవరపుకోట), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనతోనే రాష్ట్రంలో స్వర్ణయుగం సాధ్యమని ఆ పార్టీ ఎస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త గేదెల తిరుపతి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఆదివారం మార్లాపల్లి, లింగంపేట, పూడివానిపాలెం గ్రామాలకు చెందిన 60 కుటుంబాలు వైఎస్సార్ సీపీ లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. విభజనను అడ్డుకునే సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కన్వీనర్ యడ్ల నా యుడు, గుమ్మడి శ్రీను, జి. సూరిదేముడు, బి. దేము డు, ఎ. సురేష్, బి. సత్తిబాబు, పాల్గొన్నారు.
 
 భవిష్యత్తు మనదే!
 కురుపాం : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే భవి ష్యత్తు ఉందని ఆ పార్టీ నాయకులు పత్తిక లక్ష్మయ్య, పెద్దింటి జ్యో తి అన్నారు. కొండబారిడి పంచాయతీ సర్పంచ్ టి. మంజువానితోపాటు ఆ పంచాయతీ ప రిధిలోని తుమ్మిక మానుగూడ గ్రామానికి 40 కుటుం బాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే ఆయ న తనయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయూలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి. లేవిడి సర్పం చ్ పత్తిక ఇందిర, పార్టీ నాయకులు నిమ్మక గోపాల్, బోటు లక్ష్మీనారాయణ, నిమ్మక వెంకటరా వు, ఆరిక శంకరరావు, ఆరిక కిశోర్, బుద్దేష్, పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు