బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు: పరకాల

13 Oct, 2014 19:31 IST|Sakshi
బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు: పరకాల
విశాఖ: తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్ఓ లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. విశాఖలో ఈ రోజు రాత్రికి కొంత మేరకు విద్యుత్ ను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. తుఫాను నష్టంపై అంచనాకు ఇంకా రాలేదని ఆయన ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
తుఫాన్ లో మొత్తం 21 మంది చనిపోయారని, మృతుల్లో చాలా మంది వృక్షాలు విరిగి మీదపడటంతోనే మరణించారని ఆయన తెలిపారు. హుదూద్ తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారని, అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారని పరకాల ప్రభాకర్ వెల్లడించారు. 
 
మరిన్ని వార్తలు