ఉమ్మడి రాజధానిగా ఒప్పుకోం

5 Oct, 2013 06:20 IST|Sakshi

 ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ :
 హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద టీపీఎఫ్ మూడవ ఆవిర్భావ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ సీమాంధ్ర వారు హైదరాబాద్‌ను తాత్కాలి క రాజధానిగా మాత్రమే వాడుకోవాలని, ఎలాంటి షరతులు లేని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కమిటీల ద్వారా వనరుల పంపిణీ చేయాలని, ప్యాకేజీలు ఇస్తే అవి ఇన్నాళ్లు సీమాంధ్ర పాలకు ల చేతిలో నష్టపోయిన తెలంగాణకే ఇవ్వాల న్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీలో 22 గ్రామాలను కలపడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
 
 హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో చీకటి ఒప్పందాలు, కుట్రలకు పోవద్దని అన్నా రు. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తూనే ఈనెల 9న  హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీఎఫ్ మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, తెలంగాణ వాదులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకులు నలమాస కృష్ణ, బి.రమాదేవి, ఉమదేవి, జనగామ కుమారస్వామి, రాజేంద్రప్రసాద్, నర్సిం గరావు, జంజర్ల రమేశ్, రజిత, పాణి, సుధాకర్, ఎన్.రాజయ్య, మంద సంజీవ, బిల్ల మహేందర్, బి.రాములు, కళ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు