హైదరాబాద్ యూటీ అంటే సహించం : నాగేందర్ గౌడ్

1 Dec, 2013 23:54 IST|Sakshi

 ఆలంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూటీ అనేది ప్రజాస్వామ్య విరుద్ధమని, హైదరాబాద్‌పై తెలంగాణ ప్రజల హక్కును హరించాలని చూస్తే సహించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే రంగారెడ్డి జిల్లా ఉనికి కోల్పోతుందన్నారు. తెలంగాణ తామే తెచ్చామని చెప్పుకుంటున్న ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాయల తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్, భద్రాచలం సహా ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకూ టీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు.
 
  ఈ క్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు బూత్ లెవెల్ కమిటీలను నియమిస్తున్నామని చెప్పారు. సోమవారం మేడ్చల్‌లో, 3న ధారూరు, 4న ఇబ్రహీంపట్నం, 5న పరిగి,పూడూరు, 6న వికారాబాద్, 7న చేవె ళ్ల. న వాబ్‌పేటలలో పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా హయత్‌నగర్‌కు చెందిన పొగాకు నర్సింహగౌడ్‌ను నియమించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జి వంగేటి లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ బస్సు..ఆటో ఢీ

‘ఆ పూజారి కొబ్బరి చిప్పల్ని కూడా వదల్లేదు’

అంతా మా ఇష్టం..!

‘పార్టీలోని పచ్చ పుష్పాలతో తస్మాత్‌ జాగ్రత్త..’

కుందూ నది పరవళ్లు

తెలుగు విద్యార్థులకు అన్యాయం..

‘ఆ వ్యాఖ్యలు లోకేష్‌ అజ్ఞానానికి నిదర్శనం’

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

దశ తిరిగింది !

ఎరువు ధర  తగ్గిందోచ్‌!

టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం

చికెన్‌పకోడి తినలేదని ఆత్మహత్య

స్వల్పవివాదమే హత్యకు దారితీసింది

హౌస్‌ ఫర్‌ ఆల్‌...  అంతా గోల్‌మాల్‌...

విద్యార్థినిపై టీచర్‌ లైంగిక వేధింపులు

నీటిపై ఆసనం.. ఆకట్టుకున్న విన్యాసం

పని ఎప్పటికవుతుందో..!

రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

వండవదొరకు కన్నీటి వీడ్కోలు 

భూకబ్జాపై సైనికుడి సెల్ఫీ వీడియో

అజ్ఞాతవాసి... లోకేష్‌ బాబు!

తప్పు ఎస్వీ యూనివర్శిటీదే..!

ఏసీబీ వలలో ఆర్‌ఐ

యువత రమ్మీ రాగం..!

38 మండలాలు.. 15,344 క్లస్టర్లు

మర్లగూడెం.. రణరంగం

విద్యామంత్రం.. నారాయణ కుతంత్రం. ఆత్మహత్యలు నిత్యకృత్యం

తీయని విషం

వెలుగు చూసిన పురాతన ఆలయం

ఓ మనిషీ! తెలుసుకో ఇందులో పరమార్థం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను