మంత్రి ఆలస్యం.. భక్తులకు నీరసం

3 Jul, 2014 01:34 IST|Sakshi
మంత్రి ఆలస్యం.. భక్తులకు నీరసం
  •  ఆలస్యంగా ప్రారంభమైన అన్నదానం
  •  మూడు గంటలపాటు క్యూలైన్‌లోనే భక్తుల పడిగాపులు
  • విజయవాడ : దుర్గమ్మ అన్నప్రసాదాన్ని స్వీకరించేం దుకు బుధవారం ఇంద్రకీలాద్రికి చేరుకున్న భక్తులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాక ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా రోజూ ఉదయం 10.30 గంటల నుంచే ఆలయంలో అన్నప్రసాదం పంపిణీ ప్రారంభిస్తారు. అమ్మవారి సన్నిధిలో ఐదు వేల మందికి అన్నసంతర్పణను బుధవారం నుంచి ప్రారంభించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

    ఉదయం 10.45 గంటలకు ఈ కార్యక్రమాన్ని మంత్రి ఉమా ప్రారంభిస్తారని ప్రకటించారు. అయితే మంత్రి రాక ఆలస్యం కావడంతో కార్యక్రమాన్ని 12 గంటలకు ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు నేరుగా క్యూలైన్‌లోకి చేరారు. ఎంతకీ అన్న ప్రసాదం పంపిణీ ప్రారంభం కాకపోవడంతో పలువురు భక్తులు నిరాశగా వెను తిరిగారు.

    సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం క్యూలైన్‌లోనే వేచివున్నారు. వృద్ధులు, చిన్నారులు నీరసంతో ఇబ్బందిపడ్డారు. క్యూలైన్‌లో ఉన్న వారికి అధికారులు కనీసం మంచినీరు కూడా అందజేయలేదు. మంత్రి కోసం తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబని పలువురు భక్తులు ప్రశ్నించారు.
     

>
మరిన్ని వార్తలు