36 గంటల్లో అల్పపీడనం

12 Aug, 2019 08:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

13న ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

సాక్షి, విశాఖపట్నం : ఈశాన్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడుతుందని ఐఎండీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

అదేవిధంగా దక్షిణ కోస్తా సముద్రతీరం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో ఈ నెల 13వ తేదీన ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు