-

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుఫాను సూచన

25 Apr, 2019 10:58 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకుని అల్పపీడనం కేంద్రీకృతమైవుంది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 6 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 36 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతానికి అనుకుని వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

వాయుగుండం వాయువ్య దిశగా తమిళనాడు వైపు పయనిస్తూ ఈ నెల 28 నాటికి తూఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 30న తుఫాను ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు