చేనేత రుణాలు మాఫీ చేయాలి

13 Jun, 2014 02:38 IST|Sakshi
చేనేత రుణాలు మాఫీ చేయాలి

ఏపీ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసులు
ఉరవకొండ: కరువు పీడిత అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తే గానీ అప్పుల ఊబి నుంచి కోలుకోలేరని ఏపీ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసులు తెలిపారు. గురురవారం ఉరవకొండలోని చేనేత కార్యాలయుంలో నిర్వహించిన అసోసియేషన్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు.  జిల్లాలో సహకార, సహకారేతర రంగాల్లో ఉన్న చేనేత కార్మికులు 31-03-2014 నాటి వరకు తీసుకున్న రుణాలు రద్దు చేయూలన్నారు. ఐదేళ్లుగా చేనేత ముడిసరుకుల ధరలు పెరిగి, కార్మికుడు నేసిన చీరలకు గిట్టుబాటు ధర రాక 109 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, చేనేత శాఖ వుంత్రి కొల్లి రవీంద్రలకు నివేదికలు పంపావున్నారు. జిల్లాలో మూతపడిన చేనేత పరిశ్రవులు, సంఘాలను ఆదుకుని, వాటిపై అప్పులను రద్దు చేసి తిరిగి పురుద్ధరించాలని కోరారు. జిల్లాలో ప్రాధమిక  చేనేత , స్వయుం సహాయుక, వ్యక్తిగత, హార్టిజన్, వీవర్స్ క్రెడిట్ కార్డుల ద్వారా  బ్యాంకుల్లో తీసుకున్న స్వల్పకాలిక , వుధ్యకాలిక, దీర్ఘకాలిక, నగదు రుణపరపతి రుణాలు  వెంటనే మాఫీ చేయూలన్నారు. చేనేత కుటీర, చిన్నతరహా పరిశ్రవులకు తీసుకున్న నగదు రుణపరపతిని, చేనేత గ్రూపులు మగ్గాలపై తీసుకున్న రుణాలను రద్దు చేయూలన్నారు. రుణాల మాఫీ కోసం డీసీసీబీ చైర్మన్ శివశంకర్‌రెడ్డి కూడా నివేదికలు పంపారన్నారు.

మరిన్ని వార్తలు