చిక్కుకుపోయారు

6 Aug, 2018 06:55 IST|Sakshi
టిబెట్‌లోని పిన్‌కోట్‌ ప్రాంతంలో చిక్కుకున్న మానస సరోవర్‌ యాత్రికులు

టిబెల్‌లోని పిన్‌కోట్‌లో చిక్కుకున్న జిల్లావాసులు

మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రతికూల వాతావరణం

ఆహారం, మందులు లేక ఇబ్బంది పడుతున్న వైనం

అందని సహాయక చర్యలు

పశ్చిమగోదావరి, ఏలూరు (సెంట్రల్‌): కైలాస మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లావాసులు టిబెట్‌లో చిక్కుకుపోయారు. మానస సరోవర్‌లో దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా టిబెట్‌లోని పిన్‌కోట్‌ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో జిల్లావాసులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 90 మంది వరకు ఆగిపోయినట్టు ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ భర్త ఎస్‌ఆర్‌ఎం
పెదబాబు ఆదివారం ‘సాక్షి’కి ఫోన్‌లో తెలి పారు. పిన్‌కోట్‌ ప్రాంతంలో దట్టంగా మంచు కురవడంతో నేపాల్‌ నుంచి ఈ ప్రాంతానికి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు పిన్‌కోట్‌ ప్రాంతంలో చిక్కుకున్నారు. ఎటువంటి సహాయక చర్యలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానస సరోవర్‌ యాత్రికులను సురక్షితమైన ప్రదేశాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు ఇప్పటికే ప్రకటిం చింది.

యాత్రికులను నేపాల్‌ తరలించేందుకు నేపాల్‌ అధికారులతో సంపద్రింపులు జరుపుతున్నామని, యాత్రికులకు ఆహారం, వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చె బుతోంది. అయితే వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకుచేస్తున్న ప్రయత్నాలకు అక్కడి వాతావరణం ప్రతికూలంగా మారింది. జిల్లాలోని ఏలూరు నుంచి మేయరు షేక్‌ నూర్జహాన్‌ భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఆయన బావమరిది బాజీ, కాంట్రాక్టర్‌ గంటా కోటేశ్వరరావు మరికొందరు గతనెల 23న ౖMðలాస మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు. వీరంతా 31న మానస సరోవర్‌లో దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. టిబెట్‌లోని పిన్‌కోట్‌ ప్రాంతానికి రాగా అక్కడ నుంచి నేపాల్‌ వచ్చేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో జిల్లావాసులతో పాటు మొత్తం 90 మంది వరకు పిన్‌కోట్‌ ప్రాంతంలో చిక్కుకుపోయినట్టు పెదబాబు ‘సాక్షి’కి తెలిపారు. పిన్‌కోట్‌ ప్రాంతం నుంచి ముందుగా నేపాల్‌కి యాత్రికులను తరలించాలంటే విమానాలు ఉపయోగించాల్సి ఉంటుంది. కాని అక్కడ దట్టమైన మంచు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగిందని పెదబాబు చెప్పారు.

ఆహారం అందక ఇబ్బందులు
టిబెట్‌లోని పిన్‌కోట్‌ ప్రాంతంలో చిక్కుపోయిన జిల్లావాసులకు ఆహారం లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. యాత్రకు వెళ్లిన వారిలో వృద్ధులు, బీపీ, సుగర్‌తో బాధపడుతున్నవారు ఉన్నా రు. వారికి మందులు అందడం లేదు. యాత్రికులకు పూర్తిస్థాయిలో ఆహారం, తాగునీరు  లభించకపోవడంతో అవస్థలు పడుతున్నట్టు పెదబాబు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి సహాయక కార్యక్రమాలు ప్రారంభం కాలేదని మిగిలిన యాత్రికుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎంపీ మాగంటికి వినతి
యాత్రికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబును నగర మేయరు షేక్‌ నూర్జహాన్‌ ఫోన్‌ ద్వారా కోరారు. పెదబాబుతో మాట్లాడామని, ఆయన సురక్షితంగానే ఉన్నారని, బీపీ, సుగర్‌తో బాధపడుతున్నకొందరు యాత్రికులు మందులు అయిపోవడం, సరైన ఆహారం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు పెదబాబు చెప్పారని మేయర్‌ నూర్జహాన్‌ తెలిపారు. 

ఎవరూ ఆందోళన చెందవద్దు
టిబెట్‌లోని పిన్‌కోట్‌ ప్రాంతంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సంపద్రించామని ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రక్షణశాఖకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌ను పంపించారని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని ఎంపీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు