ఈ నోటీసుల భావమేమి బాబూ?

16 Apr, 2018 01:33 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావుకు పోలీసులు జారీ చేసిన నోటీసులో ఓ భాగం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని ప్రచారం చేసుకుంటూనే హోదా పోరాటాన్ని విచ్ఛి న్నం చేయడానికి ప్రయత్నిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష పార్టీలు, హోదా సాధన సమితి బంద్‌కు పిలుపునిస్తే దానిని విచ్ఛిన్నం చేయడానికి పోలీసులను ప్రయోగిస్తున్నారు.

బంద్‌లో పాల్గొని ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు పెడతామని ప్రతిపక్ష పార్టీల నేతలకు, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయిస్తున్నారు. దీనిని బట్టే అర్ధమౌతోంది ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది ఎలాంటిదో అని విశ్లేషకులంటున్నారు.

ఏపీకి చెందిన 25 మంది ఎంపీలంతా ఏకతాటిపైకి వచ్చి రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటే కేంద్రం దిగి వస్తుందని పిలుపునిస్తే దానికి చంద్రబాబు స్పందించలేదు. ఇంకోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలంతా రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ పోరాటం కొనసాగింపుగా బంద్‌కు పిలుపునిస్తే దానిని అడ్డుకోవడానికి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిని బట్టి చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని అర్థమౌతున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు