రుణమాఫీ భారాన్ని ప్రభుత్వాలు భరిస్తే తప్పేంటి?

4 Aug, 2014 18:28 IST|Sakshi
రుణమాఫీ భారాన్ని ప్రభుత్వాలు భరిస్తే తప్పేంటి?
హైదరాబాద్: చేపల పెంపకం వైపు దృష్టి సారించాలని వ్యవసాయ రైతులకు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. 17వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని 60వేల కోట్లకు రూపాయలకు పెంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. 
 
వెసులుబాటున్న రైతులు రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోండి అని ప్రత్తిపాటి విజ్క్షప్తి చేశారు. కొత్త రుణాలు ఇవ్వలేమన్న ఆంధ్రాబ్యాంక్‌కు లేఖ రాశామని ఓ ప్రశ్నకు సమాధానామిచ్చారు. రుణమాఫీ భారాన్ని వచ్చే ప్రభుత్వాలు భరిస్తే తప్పేముందన్నారు. బ్యాంకుల నుంచి వివరాలు వచ్చాక రుణమాఫీ ప్రక్రియ ఆరంభమవుతుందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. 
 
>
మరిన్ని వార్తలు