మీరిచ్చే భరోసా ఇదేనా?

22 Mar, 2019 09:10 IST|Sakshi

రచ్చబండ

సాక్షి, కైకలూరు :  కిరణ్‌ : ఏరా.. త్రినాథ్‌.. జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయిరా.. ఈ సారి ఏవరెవరి మధ్య ప్రధాన పోటీ ఉంటుందంటావు.. 
త్రినాథ్‌ : అరే మూడు పార్టీల మ«ధ్యనే కదరా.. 
కిరణ్‌ : అరే.. చదువుకున్నోళ్లుగా మనం.. కొద్దిసేపు నిజాలు మాట్లాడుకుందాం.. త్రినాథ్‌.. నిజం చెప్పు.. మన మచిలీపట్నం పోర్టు   నిర్మాణానికి కావల్సింది 4,000 ఎకరాలు.. ప్రభుత్వం అనుబంధ పరిశ్రమల పేరుతో ఏకంగా 30,000 ఎకరాలు సేకరించింది..  పాపం  25 గ్రామాల ప్రజలు బాధపడుతున్నారా.. లేదా..
త్రినాథ్‌ :  అరే.. మొన్నే కదరా.. పోర్టుకు శంకుస్థాపన మాపార్టీ వాళ్లు చేశారు.. టీవీ, పేపర్లో చూడలేదా?
కిరణ్‌ : త్రినాథ్‌.. మరి అంత అడ్డగోలుగా.. మాట్లాడకురా.. నాలుగున్నరేళ్లు తర్వాత ఎన్నికలు కొన్ని నెలల్లో ఉండగా శంకుస్థాపన చేస్తారా..  ఏమిటీ రాజకీయం.. 
రాజేష్‌ : (కూర్చున్న పిట్ట గోడ నుంచి దిగుతూ) అరే.. కిరణ్‌.. నేను కూడా ఓ ప్రశ్న వేస్తానురా.. అదేంటంటే... మన విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు..   పనులతీరుపై పలువురు ఆందోళన చేశారు. మనకేమో ట్రాఫిక్‌ సమస్యలు తప్పడం లేదు.. 
వినోద్‌ : ఈ ప్రశ్నకు నేను సమాధానం చెబు తా నురా.. అరే విజయవాడ తాత్కాలిక రాజధాని అయిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఈ ప్రాంతానికే ఇస్తున్నార్రా.. పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయంతే.. 
రాజేష్‌ : ఏరా.. నువ్వే చెబుతున్నావుగా.. తాత్కాలిక రాజధాని అని, రోజురోజుకూ ట్రాఫిక్‌ పెరిగిపోతుంటే ఇంకెçప్పుడురా ఫ్లైఓవర్‌ కట్టేది.. 
త్రినాథ్‌ : ఏంట్రా.. మరీ అలా మాట్లాడుతారు.. టీడీపీ రైతులకు ఎంతో సాయం చేసింది తెలుసా.. మీరు   లోపాలనే ఎత్తి చూపుతున్నారేంట్రా... 
కిరణ్‌: ఓరే.. త్రినాథ్‌.. ఏంట్రా రైతులకు ఒరి గింది.. కొద్దిసేపు వరి పక్కన పెడదాం.. 2015లో సుబాబుల్‌కు రూ.4,200, జామాయిల్‌కు రూ.4,500 గిట్టుబాట ధరగా అందిస్తామని మీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడెమో.. సుబాబుల్‌కు రూ.2,200, జామాయిల్‌కు రూ.2,600 అందిస్తున్నారు. రైతు టన్నుకు రూ.15,00 నష్టపోతున్నాడు.. ఇదేనా రైతులకు మీరేచ్చే భరోసా.. నువ్వే ఆలోచించు.. 
మహేష్‌: (కూర్చున్న వాడు ఆవేశంతో పైకి లేస్తూ) ఆరే ఏంట్రా.. మా పార్టీని అందరూ ఆడిపోసుకుంటారు.. ఏ రాష్ట్రంలోనైనా ఉచిత ఇసుక ఎక్కడైనా ఇచ్చారా.. దీనికి సమాధానం చెప్పండి.. 
కైలాష్‌ : అరే.. నీ ప్రశ్నకు మా వాళ్ల తరుపున నేను సమాధానం చెబుతాను.. విను.. ఏరా మన జిల్లాలో గన్నవరం వద్ద బ్రహ్మలింగయ్య చెరువు ఎలా ఉండేది.. అక్కడ కూడా ఇసుకను       కొల్లగొట్టారు.. ఇక జగ్గయ్యపేట, మైలవరం, నూజివీడు, కైకలూరులలో అక్రమ ఇసుక దందాలకు అదుపే లేదు.. ఇదేనా మీ ఉచిత ఇసుక  పథకం..
వినోద్‌ : ఒరే.. రాష్ట్రంలో మా  ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఏకంగా 18,500 టెంపరరీ ఉద్యోగాలు అందించింది.. ఇంతకన్నా ఏం కావాలి.. 
రాజేష్‌: ఉద్యోగాలు ఇచ్చింది.. ఇచ్చిందే కాకుండా.. తీసేసినవి కూడా చూడు.. మరి.. మొత్తం మీద ఏమైనా 23,500 ఉద్యోగాలు తీసేశారు.. నోటిఫికేషన్‌ విషయం తీసుకుంటే.. ఒకరు నోటిపికేషన్‌ ఇస్తారు.. మరొకరు తీసేస్తా్తరు.. ఏంటిరా.. ఈ పద్ధతి.. 
త్రినాథ్‌ : అరే ఇవన్నీ పక్కన పెట్టండిరా.. మా పాలనలో    మహిళా సాధికారత సాధిస్తున్నాం..  
కిరణ్‌ : అబ్బో.. బాగా చెప్పావురా.. మహిళలకు గౌరవమంటే.. తహసీల్దారుని జుట్టు పట్టుకు లాగడమా.. అంతెందుకురా.. కాల్‌మనీ కేసులో ఇక్కడ మహిళలకు ఏం న్యాయం జరిగిందో.. అందరికీ తెలుసురా.. 
మహేష్‌: అరే .. ఇది మాత్రం మా పార్టీకి అనుకూలంగా ఉంటుందిరా.. ఆస్పత్రులలో పేదలకు అనేక సేవలు అందిస్తున్నాం.. దీనిని ఎవరూ కాదనలేరు.. 
కైలాష్‌ : ఏంట్రా ఆస్పత్రుల్లో అభివృద్ధి.. మన విజయవాడ పాత ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటి ఆస్పత్రిగా 1000 పడకలు అన్ని చెప్పారు. అక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయో సామాన్య ప్రజలను అడగండి చెబుతారు.. అయినా మీ పాలనలో ఆస్పత్రిలో శిశువులను ఎలకలు కొరికిన సంఘటనలను.. జనాలు మర్చిపోయారనుకుంటున్నారా..
వినోద్‌ : అరే..  ఊరుకోండిరా.. ఎండ ఎక్కువ అవుతోంది.. పోదాం పదండి ఇళ్లకు..                  

మరిన్ని వార్తలు