ఎంసెట్ విడిగానా? ఉమ్మడిగానా?

27 Jan, 2015 19:32 IST|Sakshi
ఎంసెట్ విడిగానా? ఉమ్మడిగానా?

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన  మంగళవారం ఏపీ ఇంటర్ బోర్డు సమావేశం జరిగింది. ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదని సమావేశంలో గంటా పేర్కొన్నారు. అందువల్ల తప్పని పరిస్థితుల్లో పరీక్షలు విడిగా నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులతో చర్చించామన్నారు.

అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చే ఏర్పాట్లపై ఆలోచిస్తున్నామన్నారు. ఇంటర్ పరీక్షల్లాగే ఎంసెట్ పరీక్షల్లోనూ తెలంగాణ ప్రభుత్వం బెట్టు చేస్తోందని దుయ్యబట్టారు. ఎంసెట్ ను విడిగా నిర్వహించాలా? లేక ఉమ్మడిగా నిర్వహించాలా? అనే దానిపై అధికారులతో సమాలోచనలు జరుపుతున్నామన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గంటా తెలిపారు.

మరిన్ని వార్తలు