ఆలయాలను ఫొటో తీస్తున్నారా?

2 Oct, 2014 23:18 IST|Sakshi
ఆలయాలను ఫొటో తీస్తున్నారా?

హిందూ, జైన, బౌద్ధ దేవాలయాల సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడ తామూ ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతారు. వాటిని ఎవరికైనా చూపించడానికి ‘ఫలానా దేవాలయం ముందు ఫొటో దిగాం’ అని చెప్పుకుంటారు. కానీ, అంతకన్నా దేవాలయ నిర్మాణంపై దృష్టి పెట్టి తీసిన ఫొటోలతో ఎదుటివారి ముందు ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించవచ్చు.

ముందుగా ఆలయం వెలుపలి నిర్మాణం అంతా ఫొటోలో వచ్చే విధంగా జాగ్రత్తపడాలి.
     
తర్వాత నిర్మాణ కళకు సంబంధించిన వివరాలను తెలియజేసే ఒక్కో భాగాన్ని క్లోజప్ షాట్స్‌లో తీసుకోవాలి.
     
ఆ తర్వాత దేవాలయాల లోపలి గదులను ఫొటోలకు ఎంచుకోవాలి. గదులు చీకటిగా ఉంటాయి. ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే కాంతి మార్గం, దీపాల వెలుగు ద్వారా లోపలి అద్భుతాన్ని చూపించగలగాలి.
     
పూజారులు, బౌద్ధ సన్యాసులు, అఘోరాలు.. ఇలా ఆ ఆలయానికి ప్రత్యేకం అనిపించేవారిని ఫొటో తీసుకోవాలి.
 
ఇవన్నీ వరుస క్రమంలో అమర్చి ఒక ఆల్బమ్ తయారుచేస్తే మీరు వెళ్లి, సందర్శించిన ఆలయం, అక్కడి శిల్ప సంపద, చారిత్రక వైభవం చక్కగా కళ్లకు కడతాయి.    
 
నోట్: ఆలయాలలో ఫొటోలకు అనుమతులు తప్పనిసరి. ఫొటో నిషేధిత ఆజ్ఞలను తప్పక పాటించాలి.
 

మరిన్ని వార్తలు