వచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకుందాం

8 Dec, 2013 04:34 IST|Sakshi

=పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి
 =టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్

 
వరంగల్ రూరల్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ సాధించడంతోనే మన బాధ్యత తీరిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములై కంటికి రెప్ప లా కాపాడుకుందామని టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. మామునూర్ ఫాత్ ఫైండర్ పాఠశాల ఆవరణ లో నిర్వహిస్తున్న పార్టీ హన్మకొండ మండల కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా శనివారం హాజరయ్యారు. ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఈటెల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి 13 ఏళ్లపాటు చేసిన ఉద్యమాలతో సిద్ధించిన రాష్ట్రం పూర్తిగా రూపుదిద్దుకునే వరకూ యువకులు, మేధావు లు, అన్ని వర్గాల వారు అప్రమత్తంగా ఉండాల ని కోరారు. ప్రజల జీవితాల్లో వికాసం, అభివృ ద్ధి జరిగినప్పుడే మన మీద విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే వనరులను సద్వినియోగం చేసుకుని బీడు భూములను సాగులోకి తెచ్చుకుని అభివృద్ధి పథంలో పయనించాలన్నారు.

కే జీ నుంచి పీజీ వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ద్వారా ఉచి తంగా విద్య అందుకునేలా, పేదలకు పక్కా ఇళ్లు, పింఛన్ రూ.వెయ్యికి పెంచుకోవడానికి ప్ర ణాళికలు రూపొందించి అమలుచేసుకుందామ ని చెప్పారు. ఇందుకోసం తుదికంటా కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు మాయ మాటలను ఎవ్వరూ నమ్మరని, తెలంగాణ బిల్లును అడ్డుకుంటే మరోసారి అభాసు పాలవుతారని స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన లో 60 ఎళ్ల ఉద్యమం ఒక ఎత్తయితే.. 13 ఎళ్ల టీఆర్‌ఎస్ పోరాటాలు, కేసీఆర్ దీక్ష మరో ఎత్తు అని అభివర్ణించారు.

ప్రస్తుతం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఎర్పడిందని, అంక్షలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. స్టెషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర కోసం చిత్తశుద్ధితో పోరాడి న ఉద్యమ సారధులనే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసమే పుట్టిన పార్టీ రాష్ట్ర అవిర్భావం తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని చెప్పారు. ఉద్యమంలో హన్మకొండ మండల ప్రజల పాత్ర కీలకమైనదని అన్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగానే రాష్ర్టం సిద్ధించిందన్నారు. అంతకు ముందు మహిళలు బతుకమ్మలు చెతపట్టుకుని సభాస్థలికి చేరుకున్నారు. నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధనపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆరూరి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు మర్రి యాదవరెడ్డి, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, లలితాయాదవ్, రాజయ్య యాద వ్, ఇనుముల నాగేశ్వర్‌రావు, పసునూరి దయాకర్, నయీమొద్దీన్, వనంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
‘బిల్లు’ ఆపే శక్తి ఎవరికీ లేదు

 కొడకండ్ల : వచ్చే శీతకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో అత్యధిక మెజార్టీతో ఆమోదం పొందుతుంది.. దానిని ఆపే శక్తి ఎవరికీ లేదని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక పద్మశాలి ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన పార్టీ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా మా ట్లాడుతూ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎజెం డాలో తెలంగాణ అంశం ఉందని, 2009 టీఆర్‌ఎస్‌తో పొత్తు సందర్భంగా టీడీపీ అధినేత ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చారని చెప్పారు. గతంలో తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించిన వీరు ఇప్పుడు శాసనసభలో తెలంగాణ బిల్లు ఎలాఆమోదించరో చూస్తామని అన్నారు.
 

మరిన్ని వార్తలు