రామోజీరావుకు పత్రికా విలువలు తెలియవు

10 Jun, 2020 17:29 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఈనాడు దినపత్రికలో వచ్చిన అసత్య కథనాలను ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రామోజీరావుకు పత్రికా విలువలు లేవు, కనీసం మానవతా విలువలు అయినా ఉన్నాయా? అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. ‘ఈనాడు పత్రికలో ప్రభుత్వం మీద తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. 23 సీట్లు గెలుచుకుని...అసంతృప్తితో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. మరో పదిమంది పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్న టీడీపీపై వార్త రాయాలి. అలాగే చంద్రబాబు నాయుడు చేసిన విద్యుత్ కుంభకోణం, భూదోపిడీ, అవినీతి భాగోతాలపై ఈనాడు మొదటి పేజీలో కథనాలు రాయాలి. (బాబు ఎందుకు ఓడిపోయాడో అతనికే తెలియదు)

151 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ముఖ్యమంత్రిగా బ్రహ్మండమైన సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. ఆనందంగా ఉన్న మేము ఎందుకు అసంతృప్తి గా ఉంటాం. రైతు భరోసా, ఫించన్లు పెంపు వంటి పలు సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటే మేమేందుకు అసంతృప్తిగా ఉన్నామో రామోజీ చెప్పాలి. సంక్షే‌మ పధకాలతో రాష్ట్రంలో పేద ప్రజలందరు ఆనందంగా ఉన్నారు. దుర్మార్గుడైన చంద్రబాబును సమర్ధిస్తూ ...  ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో రామరాజ్యంపై అసత్య కథనాలు రాయడం సరికాదు. రామోజీరావు ఇప్పటికైనా మానవతా విలువలు పాటించాలి’ అని సూచించారు.

మరిన్ని వార్తలు