రేపే ప్రజాతీర్పు

22 May, 2019 10:38 IST|Sakshi
తమ్మినేని సీతారాం, కూన రవికుమార్‌

విజయం ఎవరిని వరిస్తుందో..

అభ్యర్థుల్లో ఉత్కంఠ

అందరి దృష్టి ఆమదాలవలస పైనే

సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం​): సార్వత్రిక ఎన్నికల ప్రజాతీర్పు రేపు వెలువడనుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని అటు రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమదాలవలసలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ ఉండడంతో రాష్ట్రంలో అందరి చూపు ఆమదాలవలస నియోజకవర్గం పైనే ఉంది. పోలింగ్‌ జరిగి ఫలితాల వెల్లడికి మధ్య సుమారు 40 రోజుల విరామం ఉండడంతో అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండడంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రజాతీర్పుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. అని చర్చించుకుంటున్నారు. 

ఆమదాలవలస నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ్మినేని సీతారాం, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూన రవికుమార్, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బొడ్డేపల్లి సత్యవతి, బీజేపీ అభ్యర్థిగా పాతిన గడ్డియ్య, జనసేన అభ్యర్ధిగా పేడాడ రామ్మోహన్‌రావు, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా తూలుగు సతీష్‌కుమార్‌ బరిలో నిలిచారు. అయితే వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పోలింగ్‌ సరలి బట్టి ఇక్కడ విజయం సాధిస్తారనేది స్పష్టత రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అధిక శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి పడ్డాయని, ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం గెలుపు తద్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేయగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, ప్రజలు మరోసారి కూన రవికుమార్‌కు పట్టం కడతారని టీడీపీ వర్గీయులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో 78.8 శాతం పోలిగ్‌ జరగడంతో ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, పసుపు కుంకుమ వంటివి లాభిస్తాయని టీడీపీ భావిస్తోంది. జగన్‌ పాదయాత్ర, నవరత్నాలు తమను గెలిపిస్తాయని వైఎస్సార్‌సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ప్రజలు నాడి పట్టుకోవడం కష్టతరంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ – టీడీపీకి పోలైన ఓట్లు వివరాలు

 మండలం   వైఎస్సార్‌సీపీ  టీడీపీ   మెజార్టీ
ఆమదాలవలస రూరల్‌ 12048 13095 1047
ఆమదాలవలస పట్టణం 7541 8947 1403
బూర్జ 10825 11059 234
సరుబుజ్జలి 9616 8912 704
పొందూరు 19168 22,686 3518

2019 ఎన్నికల పోలింగ్‌ వివరాలు
ఆమదాలవలస నియోజకవర్గం 
కోడ్‌నెంబర్‌–06, మండలాలు 4
ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జలి, బూర్జ
మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 259, 
ఆమదాలవలస–82, పొందూరు–77, సరుబుజ్జలి–45, బూర్జ–55

ఓటర్లు వివరాలు:

పురుషులు 94,224
స్త్రీలు 93,403
ఇతరులు 46
మొత్తం 1,87,673

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వడ్డీ జలగలు..!

కత్తులు, రాడ్లతో స్వైర విహారం

గుట్టుగా గుట్కా దందా

చరిత్ర సృష్టించిన ప్రకాశం పోలీస్‌

ఇక గ్రామ పంచాయతీల వ్యవస్థ 

సచివాలయం కొలువులకు 22న నోటిఫికేషన్‌

బల్లికి 3,000.. ఎలుకకు 10,000

అతివలకు అండగా..

బీసీల ఆత్మగౌరవాన్ని పెంచుతాం..

చంద్రయాన్‌–2 ప్రయోగం రేపే

రాష్ట్రమంతటా వర్షాలు

24న నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!

వార్డు సచివాలయాలు 3,775

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు డిప్లమాటిక్‌ పాస్‌పోర్టు

గల్లా జయదేవ్‌ అనుచరుల వీరంగం..

ఏపీలో ఐఎఎస్‌ అధికారుల బదిలీ..

నిరక్షరాస్యత లేకుండా చూడడమే ముఖ్యమంత్రి ధ్యేయం

రాష్ట్రంలో కొత్తగా 34,350 ఉద్యోగాల భర్తీ

కూలిన నారాయణ కాలేజీ గోడ

ఈనాటి ముఖ్యాంశాలు

షీలా దీక్షిత్‌ మృతిపై సీఎం జగన్‌ సంతాపం

మందకృష్ణ ఆందోళన వెనక చంద్రబాబు..

శాకంబరిగా రాజరాజేశ్వరి దేవి

చంద్రయాన్‌-2 చూసేందుకు వి'ల'క్షణ వేదిక

డైట్‌ కౌన్సెలింగ్‌లో కేవీ విద్యార్థులకు అన్యాయం

ప్రజా ఫిర్యాదులకు చట్టం

సీఎం జగన్‌ను కలిసిన మాజీ జడ్జి

కదిలే రైలులో మెదిలే ఊహలెన్నో!  

వైఎస్సార్‌ కృషితో ఆ సమస్య తీరిపోయింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా