వేల ఎకరాలు ఎందుకు?

4 May, 2015 01:34 IST|Sakshi

విమానాశ్రయం అంటే వేల ఎకరాలు కావాలనే వాదనలో వాస్తవం లేదని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు నిరూపిస్తోంది. అధిక ఎయిర్ ట్రాఫిక్ ఉన్న తిరువనంతపురం విమానాశ్రయాన్ని 628 ఎకరాల్లో నిర్మించారు. దేశంలోనే అత్యంత ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్ ఉన్న ముంబై విమానాశ్రయాన్ని 1850 ఎకరాల్లోనే నిర్మించారు. కానీ.. భోగాపురం విమానాశ్రయానికి 15 వేల ఎకరాలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. దేశంలో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల భూమి వివరాలు ఇలా..
 
విమానాశ్రయం          భూమి విస్తీర్ణం (ఎకరాల్లో)
తిరువనంతపురం       628
అహ్మదాబాద్            1124
చెన్నై                        1283
ముంబై                    1850
 
 
 
 

మరిన్ని వార్తలు