ఇక్కడ మీకేంటి పని?

12 Apr, 2019 14:02 IST|Sakshi
టీడీపీ నాయకుడు లింగారెడ్డిని ప్రశ్నిస్తున్న శైలజారెడ్డి

ఎన్నికల నిబంధనలు తెలియవా ?

మాజీ కౌన్సిలర్‌ లింగారెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే  సాయి భార్య శైలజారెడ్డి 

ఆదోని టౌన్‌: సాయి డిగ్రీ కళాశాల పోలింగ్‌ కేం ద్రంలో మాజీ కౌన్సిలర్‌ లింగారెడ్డితోపాటు కొం దరు టీడీపీ నాయకులు ఉండడంతో గుర్తించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సాయి ప్రసాద్‌రెడ్డి భార్య శైలజారెడ్డి... ఇక్కడ మేకేంటి పని... ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికి వచ్చిన ఆమె టీడీపీ నాయకుల గుంపును గమనించారు. ఓటర్ల ను ప్రలోభపెడుతూ... సైకిల్‌ గుర్తుకు ఓటేయా లని కోరుతున్న విషయాన్ని గమనించిన ఆమె మాజీ కౌన్సిలర్‌ లింగారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలింగ్‌ బూత్‌ ఇక్కడ కాదుకదా... ఎందుకొచ్చినట్లు... ఏమి చేస్తున్నారు... ఎన్నికల నిబంధనలు తెలియవా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడున్న పోలీసులు, మీడియా చుట్టుముట్టారు.

లింగారెడ్డి ఓటరు కాదు.. ఏజెంటు కాదు... పోలింగ్‌ బూత్‌లో పనేంటని ప్రశ్నించారు. ఇంత దారుణంగా ప్రచారం చేస్తు న్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నాయకులు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. అదేవిధంగా అ ర్ధగేరి బసన్న గౌడ్‌ స్కూల్‌లోనూ పోలింగ్‌ సరళిని ఆమె పరిశీలించారు. డీఎస్పీ వెంకటరాముడుతో మాట్లాడారు.  టీడీపీ నాయకులు లోపలకు వచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని,  చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు, 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు