ఎన్ కౌంటర్పై విచారణకు అంత నిర్లక్ష్యమా?

23 Apr, 2015 17:27 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కార్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయలేదని నిలదీసింది. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో పోలీసులకు ఉచ్చు బిగిస్తున్నట్లవుతోంది. గురువారం ఎన్ హెచ్ ఆర్సీ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ వద్ద పలు కేసులను విచారించింది.

ముఖ్యంగా శేషాచలం ఎన్కౌంటర్తోపాటు వికారుద్దీన్, గత ఏడాది కిషన్బాగ్ పోలీసులపై కాల్పుల విచారణ ప్రధానంగా చేసింది. ఈ సందర్భంగా శేషాచలం ఎన్కౌంటర్కు సంబంధించి ఏపీ సర్కార్ తరుపున అడిషనల్ డీజీ లీగల్ ఎఫైర్స్ వినయ్ రంజన్ నివేదిక సమర్పించారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి స్వయంగా వెళ్లి ఎన్ హెచ్ ఆర్సీ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకొంది. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగించిన సెల్ నంబర్లనూ ఇవ్వాలని ఆదేశించింది. సమీపంలోని సెల్ టవర్ గుండా వెళ్లిన అన్ని కాంటాక్ట్ డిటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు