సినీ పరిశ్రమను రాష్ట్రానికి ఎందుకు తీసుకురారు?

6 Nov, 2017 04:03 IST|Sakshi

కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా

సాక్షి, తెనాలి: తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వపరంగా ప్రయత్నం జరగడంలేదని కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా విమర్శించారు. ఏపీకి చెందిన నటీ నటులు ఎందరో తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారని చెప్పారు. ఈ సినీ పరిశ్రమను ఇక్కడకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు.

గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుతో మాట్లాడారు.  హైదరాబాద్‌లోని ఫిలింనగర్, చిత్రపురి కాలనీలు లాంటివి అమరావతిలోనూ ఏర్పాటు చేస్తే నటీనటులు, టెక్నీషియన్లు ఏపీకి వస్తారన్నారు. రాజధానిలో స్టూడియోలు నిర్మించేవారికి భూమి కేటాయిస్తే ముందుకొచ్చేందుకు 10 మంది సిద్ధంగా ఉన్నారని దిలీప్‌రాజా తెలిపారు.

మరిన్ని వార్తలు