పోలవరంపై టీడీపీ రచ్చ వెనుక కారణమిదేనా?

17 Sep, 2019 15:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వంలో అంతా నామినేషన్ పద్దతి. తమకు నచ్చిన వాళ్లకు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చేసి అందులో పర్సంటేజీలు తీసుకున్న చరిత్ర టీడీపీ సర్కార్‌ది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనుల్లో కోట్లు కొల్లగొడుతూ సమయానికి పూర్తిచేయని వారిపై ఏపీ సర్కార్‌ కొరఢా ఝళిపించింది. పోలవరం టెండర్లు రద్దు చేయడమే కాకుండా, జ్యుడిషియల్ కమిటీ ఆమోదించే రివర్స్ టెండర్ వేసిన వారికే కాంట్రాక్ట్ ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. చంద్రబాబు హయాంలో పోలవరం ఓ బంగారు బాతుగుడ్డు. దానిలో అక్రమాలకు, అవినీతికి పాల్పడి కూడా సకాలంలో పనులు చేయించలేకపోయిన వారు ఇప్పుడు జగన్ ప్రభుత్వ పారదర్శక విధానాన్ని తప్పుబడుతున్నారు. సర్కారు రివర్స్ టెండరింగ్‌తో పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ఆదాయం చూపించేందుకు ప్రయత్నిస్తున్నా ప్రతిపక్ష నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు.  తద్వారా  ప్రభుత్వం పోలవరాన్ని ఆపివేసిందంటూ వివాదం రాజేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇది వర్షకాలంలో గోదావరికి వరద పోటెత్తుతుంది. వరద సమయంలో సాధారణంగా ఆగష్టు-నవంబర్‌ మధ్య పోలవరం ప్రాజెక్ట్‌ పనులు జరగవు. ఎలాగు ఆపేయ్యాలి. అయితే రివర్స్‌ టెండరింగ్‌ వల్లనే పనులు ఆగిపోయాయనే ప్రచారాన్ని టీడీపీ నేతలు, పచ్చ మీడియా సృష్టించడం ద్వారా మొత్తం గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రచారం చేస్తోంది. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గోదావరి నది జలలాను పూర్తిగా ఉపయోగించుకునేందుకు కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రతిపాదికన గట్టి సంకల్పంతో  పూర్తి చేస్తోంది. సంక్లిష్టమైన పనులు ఉన్నప్పటికీ ఎత్తిపోతల పనులను ఆగమేఘాల మీద తెలంగాణ ప్రభుత్వం చేయిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గత ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకమైన పోలవరం ఎక్కడివేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారు చేసింది.

అసలు ఈ ప్రాజెక్ట్‌కు నిధుల సమస్య లేదు. పోలవరానికి కేంద్రం నిధులు సమకూరుస్తున్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపకపోగా కాంట్రాక్టర్లకు అప్పనంగా చెల్లించి తద్వారా వసూళ్లకే ప్రాధాన్యత ఇచ్చినట్లు  ఆరోపణలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌ హెడ్‌వర్క్స్‌, జలవిద్యుత్‌ కేంద్రం పనులల్లో రూ. 2346.85 కోట్ల అక్రమ చెల్లింపులు, అవకతవకలు జరిగినట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ తేల్చింది. 

ఇప్పటివరకు దేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా టెండర్‌ ప్రాసెస్‌ను వైఎస్‌ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టింది. టెండర్‌ డాక్యుమెంట్లు సంస్థలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచింది. తద్వారా ఇందుకు సంబంధించిన అంశాలు దాపరికం లేకుండా సోషల్‌ మీడియాలో సైతం లభ్యమవుతున్నాయి. మొత్తం పనిని ఇప్పటికన్నా తక్కువ ధరకు రివర్స్ టెండరింగ్ లో అప్పగించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. 

తద్వారా వందలకోట్లు ఆదా చేయడమే కాకుండా గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయానే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి జగన్‌ పెట్టుకున్నారు. ఇంత మంచి ఆశయాన్ని కూడా చంద్రబాబు, పచ్చ మీడియా ఆయన తొత్తులు కాసుల కక్కుర్తి దూరమవుతుందని ఈ విధానంపై రచ్చ చేస్తూ పోరాడుతున్నారు. అయినప్పటికీ సీఎం జగన్ మాత్రం సంకల్పంతో ముందుకెళుతున్నారు. టీడీపీ నేతలకు పోలవరం ఫలహారం కాకుండా అడ్డుకుంటున్నారు. మూడేళ్లలోనే పూర్తి చేసి రైతుల కష్టాల తీర్చడానికి నడుం బిగించారు.

చదవండి:

పోలవరంపై వారంలోగా ఆర్ఈసీ భేటీ

అవినీతిని ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు?

అవినీతి నిర్మూలనకే రివర్స్ టెండరింగ్

పోలవరం సవరించిన అంచనాలు కొలిక్కి!

పోలవరం హెడ్వర్క్స్, హైడల్ కేంద్రాలకురివర్స్ప్రారంభం

పోలవరంపై 3 బృందాలు

పోలవరం.. ఇక శరవేగం!

పోలవరం ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి..

అవినీతి అంతానికే రివర్స్

మరిన్ని వార్తలు