తీర్మానం అంటే తెలంగాణవాదులకు ఎందుకు భయం: సీఎం

2 Feb, 2014 18:36 IST|Sakshi
తీర్మానం అంటే తెలంగాణవాదులకు ఎందుకు భయం: సీఎం
చట్టసభల్లో 80 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందుతాయి అని అసెంబ్లీలో విభజన బిల్లుకు వ్యతిరేకంగా చేసిన తీర్మానంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. గతంలో 3 రాష్ట్రాల ఏర్పాటు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందాయని సీఎం కిరణ్ తెలిపారు. మూజువాణి ఓటును కొందరు తొండి ఆట అని చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. 
 
పదవీ కాంక్షతోనే సమైక్యవాదులు విభజనవాదులయ్యారని, విభజనవాదులు సమైక్యవాదులయ్యారు అని సీఎం కిరణ్‌ అన్నారు. శాసనసభలో తీర్మానం వీగిపోయాక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు కిరణ్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అభిప్రాయాలు మార్చుకుంటున్నారు అని ఆయన విమర్శించారు.  
 
రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల కష్టం దాగిఉంది. రాష్ట్రం సమైక్యంగా ఉంచడానికి ఇది బ్రహ్మాస్త్రం. అసెంబ్లీలో తీర్మానం అంటే తెలంగాణవాదులు ఎందుకు భయపడుతున్నారు అని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 
 
>
మరిన్ని వార్తలు