-

రైతు సంక్షేమం కోసం జెండాలు పక్కనబెట్టి ఉద్యమిద్దాం

19 Aug, 2015 03:25 IST|Sakshi
రైతు సంక్షేమం కోసం జెండాలు పక్కనబెట్టి ఉద్యమిద్దాం

రైతు సంఘాల సమాఖ్య నాయకులు  
ఇల్లూరు బైపాస్ కెనాల్ నిర్మాణం చేపట్టాలని ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నా
 
 అనంతపురం సెంట్రల్ : రైతాంగ సంక్షేమం కోసం పార్టీ జెండాలు పక్కనబెట్టి ఐక్యంగా ఉద్యమిద్దామని రైతు సంఘాల సమాఖ్య నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఇల్లూరు బైపాస్ కెనాల్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తొలుత స్థానిక లలితాకళాపరిషత్ నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా హెచ్చెల్సీ కార్యాలయం వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శిజగదీష్ మాట్లాడుతూ  పనిలేని మంత్రులు రోజూ కాలవగట్లపై తిరుగుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా తటె ్టడు మన్ను ఎత్తారా.? ఒక్క ఎకరాకు నీరిచ్చారా అని ప్రశ్నించారు.

హంద్రీనీవాను ఏడాదిలో పూర్తి చేస్తామని,. అసంపూర్తిగా ఉన్న పట్టిసీమను జాతికి అంకితం చేస్తామంటూ ప్రభుత్వం ప్రజల చెవుల్లో పూలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాఖ ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో పెనకచేర్ల డ్యాం నుంచి హెచ్చెల్సీ 5వ డిస్ట్రిబ్యూటిరీ నుంచి ఇలూరు బైపాస్ కెనాల్‌ను సాధించుకున్నామని తెలిపారు. రూ. 2.5 కోట్లను దివంగత సీఎం వైఎస్ విడుదల చేశారని గుర్తు చేశారు. కాలువ పనులు మంజూరై పది సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకూ బైపాస్ కాల్వ పూర్తి కాలేదన్నారు.

వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఇల్లూరు బైపాస్ కెనాల్ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తీవ్ర కరువు వల్ల తాగేందుకు కూడా చుక్కనీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాగు నీరు లేక రైతుల భూములు బీడువారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ప్రసంగించారు. అనంతరం హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత నల్లప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు రమణ, సీపీఐ నేతలు జాఫర్ , నారాయణస్వా మి, అల్లీపీరా,  వైఎస్సార్‌సీపీ నేతలు ఆలమూ రు శ్రీనివాసరెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు పెద్దన్న పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు