బాబు వాగ్దానాలపై నమ్మకం పోయింది

5 Apr, 2014 02:54 IST|Sakshi

దర్శి, న్యూస్‌లైన్: ఎన్నికలు వచ్చేసరికి బూటకపు వాగ్దానాలు చేసే చంద్రబాబు మాటలపై నమ్మకం పోయిందని, జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలపై నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరామని  శివరాజ్‌నగర్, లక్ష్మీనగ ర్‌కు చెందిన దర్శి నియోజకవర్గ ముస్లిం డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ మాజీ కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి, బండారు పండు, బాల వెంకటయ్య అన్నారు. దర్శి(కురిచేడు రోడ్డు)-5 ఎంపీటీసీ పరిధిలోని శివరాజ్‌నగర్,  కొత్తపల్లి ఎంపీటీసీ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన ఆరేకటిక, రజకులు, వడిరాజులు, రెడ్డి కులాలకు చెందిన 500 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 వారికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రోజురోజుకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ప్రజాదరణ పెరుగుతోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వలన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి కూడా అభివృద్ధి లేక వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని అన్నారు.  కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పార్టీలో చేరిన వారిలో బత్తుల శోభన్‌బాబు, బత్తుల వెంకటేశ్వర్లు, పిచ్చయ్య, కిశోర్, జనార్ధన్, చిన్న నారాయణ, వినోద్, శామ్యేల్, బ్రహ్మం, రామకృష్ణ, రఘురామ్, వెంకటరావు, ఏడుకొండలు, చెన్నయ్య, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, బాలస్వామి, రంగా, కొండ, శ్రీను ముత్తులూరి వెంకటేశ్వర్లు, బండారు బాలాంజనేయులు, వీరాంజనేయులు, రామాంజనేయులు, చిన్న ఆంజనేయులు, హనుమంతు, వెంకట య్య, శ్రీను, గోవిందు, సురేష్, వెంకటేశ్వర్లు, చౌడయ్య, రామయ్య, సీహెచ్ రమణారెడ్డి, మాదిరెడ్డి గోవిందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, శివారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, వీరారెడ్డి తదితరులున్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, సాగర్ కుడికాలువ వైస్‌చైర్మన్ సద్దిపుల్లారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి సోము దుర్గారెడ్డి, యూత్ కన్వీనర్ వీసీ రెడ్డి, లింగారెడ్డి, పేరెడ్డి, చిన్న అబ్బాయి, నాగిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు