మధ్యవర్తిత్వంతో ప్రజలకు తక్షణ న్యాయం

5 Jul, 2015 02:11 IST|Sakshi

హైకోర్టు తాత్కాలిక సీజే
జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలే

విశాఖ లీగల్: మధ్యవర్తిత్వంతో కక్షిదారులకు తక్షణ న్యాయం అందుతుందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలే అన్నారు. ఆ దిశగా న్యాయవాదులు దృష్టి సారించాలని సూచించారు. శనివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ న్యాయవాదుల సంఘం నిర్వహించిన న్యాయవాదుల క్రీడా సాంస్కృతిక ఉత్సవాల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

విశాఖలో త్వరలో న్యాయవాదులకు, సంబంధిత వ్యక్తులకు మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇప్పిస్తామన్నారు. విశాఖలో న్యాయవాదులందరూ హైకోర్టు న్యాయవాదులుగా ఎదిగా అవకాశముందంటూ ఇక్కడ హైకోర్టు ఏర్పాటుపై పరోక్ష సంకేతాలిచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ మాట్లాడుతూ న్యాయవిద్య వ్యక్తిగతం కాదని, సమాజానికి, జాతికి సంబంధించిందన్నారు.
 

మరిన్ని వార్తలు