మంచి పోలీసింగ్‌తో భరోసా

26 Oct, 2015 01:07 IST|Sakshi

సీపీకి సీఎం దిశానిర్దేశం
 
విజయవాడ సిటీ : ‘రాజధాని పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు బాగుండాలి. మంచి పోలీసింగ్‌ను ఏర్పాటు చేయండి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మెరుగైన పోలీసింగ్‌తో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయనే భరోసా కల్పించాలి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌కు దిశానిర్దేశం చే శారు. రాష్ట్ర పోలీసు అధికారులతో ఆయన ఆదివారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కమిషనరేట్‌లోని పోలీసుల విధి విధానాలపై సీపీ సవాంగ్‌ను అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది.

అమరావతి రాజధాని శంకుస్థాపన తర్వాత ప్రపంచ దేశాలు ఇక్కడ దృష్టిసారించినట్టు ఈ సందర్భంగా సీఎం చెప్పారు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఇక్కడ నూతన పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసుల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని సూచించారు. బీటు సిస్టం మొదలు అన్ని విధాలుగా పోలీసు సిబ్బంది సమర్థులై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయనే భరోసా ఇచ్చినప్పుడే ఆకర్షితులైనవారు వచ్చి ఆనందంగా పరిశ్రమలు పెడతారని చెప్పారు. ఈ క్రమంలో నగర పోలీసు వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన చర్యలను పోలీసు కమిషనర్ సవాంగ్ సీఎంకి వివరించారు. పోలీసు విధులు, సేవలను డిజిటలైజేషన్‌కు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు.     
 

>
మరిన్ని వార్తలు