ఏడాదిలోగా హంద్రీ నీవా పూర్తి చేస్తాం

29 Dec, 2014 03:10 IST|Sakshi

కదిరి: జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయి న హంద్రీ నీవా ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. కదిరి రూరల్ పరిధిలోని ముత్యాలచెరువులో  రైతులు పెంచిన జొన్నగడ్డి పంపిణీని  మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆమె మాట్లాడారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందన్నా రు. వారు ప్రవేశ పెట్టిన పథకాలు కాం గ్రెస్ కార్యకర్తలకు మాత్రమే దక్కాయని విమర్శించారు. గ్రామాల్లో పార్టీలకతీ తంగా మెలిగితేనే ఆ పల్లెలు శాంతియుతంగా ఉంటాయని సూచించారు.
 
 వర్షా లు లేక పోవడంతో జిల్లా వ్యాప్తంగా భూ గర్భ జలాలు అడుగంటిపోయాయన్నా రు. 1200 అడుగులు వేసినా బోర్లలో చు క్కనీరు బయటకు రాలేదన్నారు. ము ఖ్యంగా కదిరి ప్రాంతం కరువుతో అల్లాడిపోతోందని చెప్పారు. చెరువుల్లో  పూ డికతీత పనులకు త్వరలో ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని తెలిపారు. రుణమాఫీ జాబితాలో అర్హులైన రైతులకు అన్యాయం జరిగిందని భావిస్తే ఆర్డీఓ, తహశీల్దార్ లేదా స్థానిక టీడీపీ నాయకుడిని సంప్రదించండని మంత్రి సూచిం చారు.
 
 అర్హులైన వారికి పెన్షన్లు రాకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చే యాలన్నారు. మహిళలు పొలం పనులే కాకుండా ఇంటి పనులు చే యడంతో ఒక్కోసారి వేలిముద్రల్లో తేడాలొస్తుంటాయని తన దృష్టికి వచ్చిందన్నారు. ఒక మహిళగా ఈ విషయం నిజమని తానుకూడా నమ్ముతున్నానని మంత్రి చెప్పా రు. ఈ విషయంలో సంబంధిత అధికారులే ఒక నిర్ధారణకు వచ్చి తగు న్యా యం చేయాలని ఆదేశించారు. అనంత రం మంత్రి ముత్యాలచెరువు గ్రామంలో మంచినీటి ట్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ జేడీ డా.శ్యాంమోహన్‌రావ్, ఆర్‌డీఓ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, న్యాయవాది వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు