కోర్టు సముదాయాల ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

9 Sep, 2018 13:03 IST|Sakshi

తిరుపతి క్రైం /తిరుపతి లీగల్‌: తిరుపతి కోర్టు సముదాయాల ఎదుట శనివారం ఒక మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈస్ట్‌ పోలీసుల కథనం మేరకు.. అరుణ అనే మహిళ నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న తిరుపతి ఖాదీకాలనీకి చెందిన ఆదర్స్‌రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ గతంలోనే వివాహమైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. వారి మధ్య విభేదాలు రావడంతో తనను పెళ్లి చేసుకుంటానని మోసగించాడని డాక్టర్‌పై ఆమె మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

తిరిగి ఆమె తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదంటూ కోర్టు ఎదుట పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలోని పోలీసులు గుర్తించి ఆమెను వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు అక్కడి నుంచి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తుండడంతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు కోర్టు సముదాయాల వద్ద ఉన్నారు. మహిళ కోర్టు ఎదుట హల్‌చల్‌ చేయడంతో ప్రజలు గుమికూడారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీరించడానికి ఇబ్బంది పడ్డారు. కోర్టు ఆవరణం వెస్టు స్టేషన్‌ పరిధిలోకి రావడంతో వెస్టు స్టేషన్‌ ఎస్‌ఐ, సిబ్బంది వాహనంలో వచ్చి ఆమెను స్టేషన్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు