కాల్ మనీ వేధింపులు: మహిళ ఆత్మహత్యాయత్నం

19 Dec, 2015 07:34 IST|Sakshi

రాయచోటి : వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో 'కాల్ మనీ' లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణంలోని కొత్తపల్లి ప్రాంతానికి చెందిన ఆరీఫున్నీసా శుక్రవారం నిద్రమాత్రలు మింగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆరీఫున్నీసా భర్త హసన్‌వలీ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

దాంతో కాల్‌మనీ నిర్వాహకుడు హబీబుల్లా కన్ను ఒంటరిగా ఉంటోన్న ఆరీఫున్నీసాపై పడింది. హసన్‌వలీ రూ.65 వేల రుణానికి హామీగా ఉన్నాడని, ఆ మొత్తం తీర్చాలంటూ ఆరీఫున్నీసాపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో పెద్ద మనుషుల దగ్గర ఒప్పందం కుదుర్చుకుని ఆరీఫున్నీసా రూ.46వేలు చెల్లించేసింది. అయితే ఆ తర్వాత నకిలీ పత్రాలు చూపించి.. తనతో ఉంటే బాకీ చెల్లించక్కర్లేదంటూ హబీబుల్లా వేధించసాగాడు. దీనిపై ఆరీఫున్నీసా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయినా హబీబుల్లా వేధింపులు ఆగలేదు. దీంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.

>
మరిన్ని వార్తలు