అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్..!

16 Nov, 2013 05:00 IST|Sakshi

ఉసిరికాయలపల్లి (కారేపల్లి), న్యూస్‌లైన్: భర్తతో తరచూ గొడవలు.. తీవ్ర మానసిక వేదన తట్టుకోలేని ఓ వివాహిత పురుగు మందు తాగింది. తనను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న భర్త- తన బిడ్డడిని అనాధగా మారుస్తాడన్న భయంతోనో.. మరే కారణంతోనో.. నాలుగేళ్ల వయసున్న తన కుమారుడికి కూడా కొద్దిగా పురుగు మందు తాగించింది. ఆమె మృతిచెందింది. ఆ పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు...
 
 ఉసిరికాయలపల్లి గ్రామస్తుడు పచ్చిపాల శ్రీనివాస్‌కు తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన లక్ష్మి(25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల వయసున్న కుమారుడు (నాగసాయి) ఉన్నాడు. ఇల్లెందు మండలంలో గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. అతడు ప్రతి రోజు ఉసిరికాయలపల్లి నుంచి ఇల్లెందకు రాకపోకలు సాగిస్తున్నాడు. అతను మరో యువతితో వివాహేతర సంబంధం సాగిస్తూ, లక్ష్మిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీనిపై అతనిని లక్ష్మి పలుమార్లు నిలదీసింది. ఇదే విషయమై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయతీ నిర్వహించి శ్రీనివాస్‌ను మందలించారు.
 
 అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసుగెత్తిన లక్ష్మి.. తీవ్ర మానసిక ఆందోళనతో శుక్రవారం భర్త ఇంటిలో లేని సమయంలో తన నాలుగేళ్ళ కుమారుడు నాగసాయికి కొద్దిగా పురుగు మందు తాగించి, ఆ తరువాత తాను కూడా తాగి, ఇంటి ఆరుబయట మంచంపై పడుకుంది. నాగసాయి ఏడుస్తుండడాన్ని చుట్టుపక్కల వారు చూసి, ఇంట్లోకి వచ్చారు. మంచంపై లక్ష్మి అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి, ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. చికి త్స చేస్తుండగానే ఆమె మృతిచెందింది. అప్పటికే నాగసాయి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
 
 5
 తెలంగాణపై కాంగ్రెస్ కొత్త నాటకాలు
 ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ కొత్త నాటకాలకు తెర లేపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ది వెంకటేశ్వర్లు విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- ఒకపక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూనే.. మరోపక్క సీమాంధ్రులతో ఆందోళన చేయిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలపై నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
 
  తెలంగాణపై కాంగ్రెస్ వెనుకడుగు వేస్తే అది ఈ ప్రాంతంలో భూస్థాపితమవుతుందని అన్నారు. భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలోనిదేనని అన్నారు. గడిచిన పదేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీజేపీకి కూడా అనుకూల వాతావరణం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశంలో మూడో ప్రత్యామ్నాయం అవసరమని అన్నారు. రాష్ట్ర మంత్రులు రెండు ప్రాంతాలవారీగా విడిపోయి ప్రజాసమస్యలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
 
 కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇటీవలి వర్షాలతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వ ఆసక్తి చూపడం లేదని ధ్వజమెత్తారు. బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపూరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు