న్యాయం చేయాలని యువతి దీక్ష

16 Aug, 2018 15:31 IST|Sakshi
మేరీమాతకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న ఐద్వా మహిళలు

బాధితురాలికి మహిళా కమిషన్‌

సభ్యురాలు రాజ్యలక్ష్మి పరామర్శ

యలమంచిలి: తన ప్రియుడు బండి మురళీకృష్ణతో వివాహం జరిపించాలని ఏనుగువానిలంకలో అతని ఇంటి ముందు దీక్షకు దిగిన మేరీమాత రెండో రోజు కూడా దీక్ష కొనసాగించింది. ఆమెకు మద్దతుగా ఐద్వా మహిళలు పుగాకు పూర్ణ, దూసి కల్యాణి, పొత్తూరి జ్యోతి, జిల్లెళ్ల ప్రశాంతి తదితరులు  దీక్షలో కూర్చున్నారు. పరారీలో ఉన్న మురళీకృష్ణను పోలీసులు పట్టుకుని పెళ్లి జరిపించాలని లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని ఐద్వా డెల్టా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుగాకు పూర్ణ, దూసి కల్యాణి హెచ్చరించారు. మేరీమాతకు వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ పొత్తూరి బుచ్చిరాజు, మండల ప్రతిపక్ష నాయకుడు పాలపర్తి ఇమ్మానుయేలు, నాయకులు బండి శ్రీనివాస్, నారిన వెంకటేశ్వరరావు, స్థానిక సొసైటీ అధ్యక్షుడు నారిన సత్తిబాబు, గుబ్బల ఏడుకొండలు, సీపీఎం నాయకులు బాతిరెడ్డి జార్జి, కానేటి బాలరాజు, దేవ సుధాకర్, మాసవరపు సుబ్బారావు మద్దతు తెలిపారు.

మహిళా కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి విచారణ
రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ శిరిగినీడి రాజ్యలక్ష్మి దీక్షా శిబిరానికి వచ్చి మేరీమాతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా కమిషన్‌ అండగా ఉంటుందని చెప్పారు. పోలీసుల సహాయంతో మురళీకృష్ణను పట్టుకుని అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మేరీమాతకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట ఐసీడీఎస్‌ సీడీపీఓ చెల్లుబోయిన ఇందిర, సూపర్‌వైజర్‌ కాండ్రేకుల హైమావతి ఉన్నారు.

మరిన్ని వార్తలు