యువతిపై గ్యాంగ్‌ రేప్

27 Jun, 2015 14:51 IST|Sakshi
యువతిపై గ్యాంగ్‌ రేప్

గుంటూరు (వేమూరు) : గుంటూరు జిల్లా వేమూరు మండలం రాచంపాడు పరిసర పొలాల్లో ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటి నుంచి పారిపోయిన ఓ ప్రేమజంట శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వేమూరు రైల్వేస్టేషన్‌కి వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ సైనికోద్యోగితోపాటు మరికొంతమంది యువకులు .. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని నిలదీశారు.

ఈ సమయంలో ఇక్కడ ఇలా ఉండకూడదు అని మాయమాటలు చెప్పి యువతిని స్కూటీ మీద ఎక్కించుకుని సైనికోద్యోగి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన ప్రేమికుడు 100 కు డయల్ చేసి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు వచ్చేసరికి సైనికోద్యోగితోపాటు మిగిలిన యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించి సైనికోద్యోగితోపాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు