పశువైద్యాధికారికి బదులుగా వోఎస్‌ భర్త!

3 Nov, 2017 02:38 IST|Sakshi

ఇక్కడ పశువుకు వైద్యం చేస్తున్న వ్యక్తి పశువైద్యుడనుకుంటే పొరపాటే. ఈయన కనీసం ఆస్పత్రిలో ఉద్యోగి కూడా కాదు. కానీ అక్కడి ఆఫీస్‌ సబార్డినేట్‌ (అటెండర్‌) భర్త. ఇలా నేరుగా చికిత్సలు చేసేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడమే ఇక్కడి విశేషం.

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడ గ్రామీణ పశువైద్య కేంద్రంలో అటెండర్‌గా కాంట్రాక్ట్‌ పద్ధతిలో మరడాన లక్ష్మి పనిచేస్తున్నారు. కానీ ఆమెకు బదులుగా భర్త సింహాచలం హాజరై ఇలా చికిత్సలు చేసేస్తుంటారు. ఇక్కడ ఓ లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ ఉన్నా ఆయన ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీనిపై పాత్రికేయులు ఆయన్ను ప్రశ్నిస్తే ఆయనకు అన్నీ తెలుసు. అందుకే మేమేం అడ్డుచెప్పట్లేదంటూ తప్పించుకున్నారు. కాగా, ఆయనా సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని స్థానికులు చెబుతున్నారు.     – బొబ్బిలి రూరల్‌

మరిన్ని వార్తలు