దుబాయ్‌లో ఉన్నా పింఛను..!

16 Jun, 2016 08:19 IST|Sakshi

గోపాలపురం :  అర్హత ఉన్న వారు పింఛను అందుకోవాలంటే సవాలక్ష నిబంధనలు. వేలిముద్రలు మాసేవరకూ మిషన్‌పై నొక్కిస్తారు.. కాళ్లరిగేలా తిప్పిస్తారు.. నువ్వే ఆ మనిషివని గ్యారేంటి ఏంటంటూ ఆకార్డు ఈ కార్డులు చూపించమంటారు.. కానీ, ఒకామె దుబాయ్ వెళ్లిపోయి నాలుగు నెలలైనా ఆమెకు పింఛను ఆగలేదు. మనిషి ఇక్కడ లేకపోయినా ఆమె పేరిట మూడు నెలల పింఛను పంపిణీ చేసేశారు. ఎలా, అంటే.... మాత్రం తెల్లమొఖాలు.

ఈ విచిత్ర ఘటన మండలంలోని వాదాలకుంట గ్రామంలో చోటు చేసుకుంది. మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2015-16కు సంబంధించి బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బహిరంగ విచారణ చేపట్టారు. ఈ విచారణలో పై విషయం వెలుగుచూసి అంతా అవాక్కయ్యారు. దీంతో ఆ పింఛను సొమ్ము రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇది ఇలా ఉండగా ఉపాధి నిధులు రూ.23, 237 దుర్వినియోగమైనట్టు ప్రిసైడింగ్ అధికారి అప్పారావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు