అత్తామామలు ఇంట్లోంచి గెంటేశారు

23 Oct, 2019 13:23 IST|Sakshi
బిడ్డలతో ఉన్న బాధిత మహిళ మల్లిక

న్యాయం చేయాలంటూ

బిడ్డలతో సహా రోడ్డెక్కిన మహిళ   

తోటపల్లిగూడూరు: అత్తామామలు వేధించి బిడ్డలతో సహా తనను ఇంట్లోంచి గెంటేశారని చిన్నచెరుకూరుకు చెందిన షేక్‌ మల్లిక ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని చిన్నచెరుకూరు గ్రామానికి చెందిన షేక్‌ మల్లిక అత్త ఇంట్లో ఒక పోర్షన్‌లో ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తోంది. ఆమె భర్త షేక్‌ నాగూరు 11 నెలల క్రితం చనిపోవడంతో కూలి పనుల చేసుకుంటూ ఇద్దరు బిడ్డలను పోషిస్తోంది. కొంతకాలానికి మల్లికకు ఆమె అత్తామామలకు గొడవలు మొదలయ్యాయి. ఇంట్లో ఉన్న తన వస్తువులను అత్తామామలు బయటపడేసి తనను, బిడ్డలను బయటకు గెంటాశారంటూ మంగళవారం మధ్యాహ్నం నిరసన తెలిపింది. తనను అత్తామామలైన షేక్‌ కాలేషా – మస్తానమ్మ, ఆడపడుచు షేక్‌ ఆశాలు మానసికంగా వేధించడం మొదలుపెట్టారని మల్లిక వాపోయింది. బిడ్డలతో సహా తనను ఇంటి నుంచి బయటకు గెంటేయడం అన్యాయమని అడిగితే వారు తమపై దౌర్జన్యానికి దిగారని చెప్పింది. అత్తామామలు, ఆడపడుచు నుంచి రక్షణ కల్పించాలంటూ  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

>
మరిన్ని వార్తలు