జిల్లెలగూడలో చైన్ స్నాచింగ్

24 May, 2015 10:49 IST|Sakshi

మీర్‌పేట : హైదరాబాద్ మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ ఏరియా లలితానగర్‌లో ఆదివారం ఉదయం చైన్ స్నాచింగ్ జరిగింది. లలితానగర్‌కు చెందిన మణెమ్మ(52) అనే మహిళ బస్టాప్‌లో నిలుచుని ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వేగంగా ఆమె వద్దకు చేరుకుని, మెడలో ఉన్న నాలుగు తులాల గొలుసును లాక్కుని వెళ్లిపోయారు. ఆమె తేరుకుని కేకలు వేసేలోగానే ఆగంతకులు మాయమయ్యారు.

మరిన్ని వార్తలు