పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆందోళన

19 May, 2015 02:08 IST|Sakshi

 కరప :ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ముగ్గురు ఆడపిల్ల లు పుట్టిన తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ కరప పోలీసుస్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపింది. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించింది. పెనుగుదు రు గ్రామానికి చెందిన రమణమ్మ అదే గ్రామానికి చెంది న తుమ్మలపల్లి వేణు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లయి 19 ఏళ్లయిందని, ఆ  తర్వాత వేణు తన అక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని రమణమ్మ తెలిపిం ది.
 
 ఆపైన మళ్లీ తనను హైదరాబాద్ తీసుకెళ్లాడని, గతయేడాది గ్రామానికి తీసుకొచ్చాడని చెప్పింది. ఆపైన కొన్నాళ్లకు తమను వదిలి వెళ్లిపోయాడని వాపోయింది. దీనిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని రవణమ్మ తెలిపింది. ముగ్గురు ఆడపిల్లలతో ఎలా బతకాలో అర్థం కావడంలేదని రోదించింది. తన భర్త బంధువుల ఇంటివద్దే ఉండి, లేడని చెప్పిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని ఆమె తెలిపింది. ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశానని పేర్కొంది. కరప ఎస్సై బి.వినయ్‌ప్రతాప్‌ను వివరణ కోరగా మార్చిలో ఈకేసు నమోదుచేశా మని, వేణు బంధువులను పిలిపించి విచారించామని చెప్పారు. కేసు విచారణలో ఉందని, నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు