'మహిళలు ఆర్థికాభివృద్ధిలో ముందడుగు సాధించాలి'

11 Sep, 2015 20:59 IST|Sakshi

పగిడ్యాలః స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ముందడుగు వేయాలని రాష్ట్ర మహిళ సాధికారిక డెరైక్టర్ సంజీవ్‌ పన్వల్కర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కర్నూలు జిల్లా పగిడ్యాలలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమాఖ్య పొదుపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ.. పొదుపు సంఘాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారా? లేదా? అంటూ ప్రశ్నించారు. మైక్రోఫైనాన్స్ వడ్డీల భారం నుంచి విముక్తి పొందడానికి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం గ్రూపులకు వడ్డీలేని రుణాలను అందజేస్తుందని ఆయన వివరించారు.

>
మరిన్ని వార్తలు