మహిళలు రాణించాలి

9 Mar, 2014 03:25 IST|Sakshi

సంచార చిత్ర ప్రదర్శనను తిలకించిన మహిళలు: సత్యవేద మహిళా మండలి ఆధ్వర్యంలో బ్రూణహత్యలు నివారిం చండి.. ఆడపిల్లలను కాపాడండి.. అనే నినాదంతో సంచార చిత్ర ప్రదర్శన చేపట్టింది. కార్యక్రమాన్ని జడ్జి పద్మజ ప్రారంభించారు.
 
 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మహిళలు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణించాలని స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి పద్మజ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
 
 ఉదయం మహిళా చట్టాలు, హక్కులపై అవగాహన కల్పిస్తూ పలువురు ప్రసంగించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 6, 7 తేదీల్లో మహిళా ఉద్యోగులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలిచినవారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి పద్మ మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించేందుకు, మహిళా హక్కులను కాపాడేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు.
 
 పధాన వక్త, అభ్యుదయవాది, రిటైర్డ్ తెలుగు లెక్చరర్ డాక్టర్ ఎన్.శాంతమ్మ మాట్లాడుతూ మహిళలు ఇంకా వివక్షతకు, వేధింపులకు గురువుతున్నారని ఆవేదన చెందారు. స్త్రీ శిశు సంక్షేమ  శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ ముత్యాలమ్మ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు  విజయకుమారి, సరస్వతి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ సహకారంతో ఏటా మహిళా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలు మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవీ శ్యామల, మహిళా ఉద్యోగుల సంఘం నేతలు అనంతలక్ష్మి, ఉషావర్దిని, జ్ఞానేశ్వరమ్మ, ఆశాలత, మీనాక్షి దేవి, సరళమ్మ, అరుణ తదితరులు ఐసీడీఎస్  సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు