ప్రజారోగ్యానికి ప్రపంచబ్యాంకు రుణం

3 Feb, 2018 01:33 IST|Sakshi
మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు, మంత్రులు

రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు రుణం తీసుకోవాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి మండలి నిర్ణయాలను విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌లతో కలసి సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. 

- రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.4,807 కోట్లు అవసరమని, వాటిలో ప్రపంచబ్యాంకు నుంచి 70 శాతం (రూ.3,365 కోట్లు) రుణంగాను, మిగిలిన 30 శాతం (రూ.1,442కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. 
టాటా ట్రస్ట్‌కు బాలామృతం కార్యక్రమంలో పౌష్టికాహారాన్ని అందించే బాధ్యత అప్పగింత. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ట్రస్టు ద్వారా మహిళలకు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉంటుంది.  
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రూ. 38,265 కోట్లతో 5 లక్షల ఇళ్ల నిర్మాణం. ఈ హౌజింగ్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,035 కోట్లు, కేంద్రం రూ.7,500 కోట్లు భరిస్తాయి. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు సమకూర్చుకుంటాడు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా