గోమాతకు సీమంతం

13 Aug, 2017 01:09 IST|Sakshi
గోమాతకు సీమంతం
అ అంటే అమ్మ అని.. ఆ అంటే ఆవు అని చిన్నారులకు అక్షరాలు నేర్పుతుంటాం. అమ్మ తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన గోమాతకు పండుగలు, వ్రతాల సమయంలో విశిష్ట పూజలు చేస్తారు. అదేవిధంగా వైఎస్సార్‌ జిల్లా పాత కడపకు చెందిన పల్లా నరసింహులు పెంచుతున్న గోవుకు నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆ ఆవు చూడిదైంది (గర్భం దాల్చింది). సంప్రదాయం ప్రకారం మహిళలకు ఏ విధంగా అయితే సీమంతం చేస్తారో నరసింహులు తన కూతురులాగా భావించే గోమాతకు శనివారం సాయంత్రం సీమంతం చేశారు. గ్రామంలోని మహిళలందరు వచ్చి గోమాత చుట్టూ తిరుగుతూ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ.. ఈ గోమాత చూడిదైన ప్రతిసారి కోడెదూడలే పుడుతున్నా యని తెలిపారు. వాటిని చాలా మంది కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. 
– కడప అగ్రికల్చర్‌
మరిన్ని వార్తలు