ఆశయంతో వైఎస్ పాలన..వినాశనంగా చంద్రబాబు పాలన

3 Dec, 2018 18:51 IST|Sakshi

చంద్రబాబు డాక్యుమెంటరీలను ప్రదర్శించి మహిళలను మభ్యపెడుతున్నారు

ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారు : తలారి రంగయ్య

సాక్షి, అనంతపురం : సంఘదర్శిని పేరుతో డ్వాక్రా మహిళలను మభ్యపెడుతోందని, శిక్షణ పేరుతో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని, వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి రంగయ్య పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  టీడీపీని విమర్శించారు. శతమానంభవతి పేరుతో చంద్రబాబు పై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించి డ్వాక్రా మహిళలకు చూపుతున్నారని... వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అధికారుల ద్వారా ప్రచారం చేయించటం దుర్మార్గం అని ఈ సందర్భంగా రంగయ్య ఆక్షేపించారు. వెలుగు, సెర్ఫ్ అధికారులు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని కోరారు. ‘చంద్రబాబు డాక్యుమెంటరీలను ప్రదర్శించి మహిళలను మభ్యపెడుతున్నారువడ్డీ లేని రుణాలు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కే దక్కింది. డ్వాక్రా మహిళలను లక్షాధికారులు కావాలన్న ఆశయంతో వైఎస్ పాలన సాగించారు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానన్న సీఎం చంద్రబాబు ఎందుకు మాట తప్పారు? ’అని ప్రశ్నించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా