యాదవులను నిర్లక్ష్యం చేసిన యనమల

10 Apr, 2019 08:37 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న అన్నే నాగేశ్వరరావు. చిత్రంలో అల్లి రాజబాబు తదితరులు

సాక్షి, కాకినాడ: యాదవుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటుతోపాటు మేనిఫెస్టోలో అనేక అంశాలు చేర్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే యాదవులు మద్దతుగా నిలవాలని జిల్లా యాదవ సంఘ అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు అల్లి రాజబాబుతో కలిసి మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, గొర్రెల కాపర్లకు ఉచిత ఇన్సూరెన్స్‌తోపాటు సన్నిధిగొల్ల విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయం యాదవులకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. యాదవుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న యనమల యాదవుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు.

సన్నిధి గొల్ల విషయంలో యనమల ఇప్పటికీ స్పందించలేదని, టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు. యాదవ కులస్తులకు పెద్దగా చెప్పుకునే ఆయన ఏనాడు వీరి సంక్షేమాన్ని పట్టించుకోలేదని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర, రూరల్‌ యాదవ సంఘ అధ్యక్షుడు జాడా అప్పలరాజు, నాయకులు ఎన్‌.బాబురావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు