సీఎస్‌పై యనమల విమర్శలు

21 Apr, 2019 14:44 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సీఎస్‌ నియామకాన్ని, నిర్ణయాలను ఓ ప్రకటనలో ఆయన తప్పుబట్టారు. ఆర్థిక శాఖలో వ్యవహారాలపై సీఎస్‌ సూచనలను యనమల విభేదించారు. నిధుల సమీకరణ, విడుదలలో మంత్రివర్గ నిర్ణయమే ఫైనల్‌ అని అభిప్రాయపడ్డారు. ప్రధాన కార్యదర్శి సర్వీస్‌ రూల్స్‌ అతిక్రమిస్తున్నారని విమర్శించారు. సీఎస్‌ మంత్రివర్గానికి సబార్డినెట్‌ అని అలాంటిది ఆయన మంత్రివర్గ నిర్ణయాలను ఎలా ప్రశ్నిస్తారనే వాదనను లేవనెత్తారు. కాగా ఇటీవలే ఆర్థికశాఖలోని అడ్డగోలు వ్యవహారాలపై సీఎస్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ప్రాధాన్యత క్రమం లేకుండా చెల్లింపులు చేయడంపై ఆయన...అధికారులను వివరణ కోరారు. సీఎస్‌ సమీక్షతో నేపథ్యంలో ఉలిక్కిపడ‍్డ మంత్రి యనమల ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు