ఓటింగ్ జరపాల్సిందే: యనమల

12 Jan, 2014 01:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో ఏ అంశంపైనైనా సభ్యుడు ఓటింగ్ కోరితే తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని, ఇందులో సభాపతికి మరో గత్యంతరం ఉండదని శనివారం టీడీపీ నేత, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఓటింగ్ కోరే హక్కు ప్రతి సభ్యునికి ఉంటుందని అన్నారు. విభజన బిల్లుపై శాసనసభలోను, మండలిలోను వేలాదిగా సవరణ ప్రతిపాదనలు వచ్చాయని, ప్రతి సవరణపైనా చర్చ, ఓటింగ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతగా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు సవరణలను ప్రతిపాదించలేదనేది పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు.

మరిన్ని వార్తలు