ఎమ్మెల్సీ పదవికి యనమల రాజీనామా

30 Aug, 2013 13:04 IST|Sakshi

హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు శుక్రవారం  ఎమ్మెల్సీ పదవికి రాజీమానా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు.  ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తడితో పాటు, సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో యనమల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ సీమాంధ్ర ఎంపీలు  'రాష్ట్ర విభజన స్వార్థపూరిత నిర్ణయం' పేరుతో ఈరోజు మూడు పేజీల లేఖను విడుదల చేశారు. ఈ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు పంచారు.

మరిన్ని వార్తలు