రెండూ తప్పే : యార్లగడ్డ

24 Sep, 2019 16:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఒకే దేశం - ఒకే భాషా విధానం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు సరికాదని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ తెలిపారు. అలా కాకుండా త్రిభాషా సూత్రాన్ని పాటించాలని కోరారు. రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడం ఎంత తప్పో, అలానే హిందీని నేర్చుకోమనడం కూడా అంతే తప్పన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దక్షిణాది భాషలను నేర్పించాలని సూచించారు. అసెంబ్లీ, సచివాలయంలో తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకోవాలని రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కలిసి కోరతానని యార్లగడ్డ వెల్లడించారు. తెలుగు యూనివర్సిటీకి అనుబంధ సంస్థలైన రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలలో ఒక్కో కోర్సు మాత్రమే ఉందని, హైదరాబాద్‌, వరంగల్‌లలో 16 కోర్సులు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు భాషా యూనివర్సిటీలకు 10వ షెడ్యూల్‌ అవరోధంగా మారిందని, విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్లోని సంస్థల పంపకాలు నెలరోజుల్లోగా పరిష్కారమవుతాయని ఇద్దరు సీఎంలు చెప్పడం హర్షణీయమన్నారు. 

మరిన్ని వార్తలు