వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన నేత

19 Mar, 2019 14:45 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరగా.. ఇటు జనసేన నుంచి రాకలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సభలో మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కుమారుడు, జనసేన నేత యర్రా నవీన్‌ వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

పవన్‌ కళ్యాణ్‌ తీరుకు నిరసనగా ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన నవీన్‌.. వైఎస్‌ జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు టీ.నరసాపురం మండలానికి చెందిన టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. భీమడోలు డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌, టీడీపీ సీనియర్‌ నేత పిన్నమనేని రాధాకృష్ణ, రాజ్‌కుమార్‌లను వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీ విజయం సాధించడం ఖాయమన్నారు. వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. (చదవండి: జనసేన పార్టీలో ముసలం)

మరిన్ని వార్తలు