పారిశుధ్యంపై దృష్టి సారించాలి

26 Jul, 2018 10:56 IST|Sakshi
ప్రజాదీవెనలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌

నెల్లూరు(సెంట్రల్‌): నగరంలో శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందిగా కార్పొరేషన్‌ అధికారులకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ సూచించారు. స్థానిక 46వ డివిజన్లోని ఆచారివీధి, దేవిరెడ్డివారి వీధి, కాపు వీధి, ముత్తరాజువారివీధి, మంగళవీధి ప్రాంతాల్లో కార్పొరేటర్‌ వేలూరు సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. నర్తకీ సెంటర్, కాపువీధి ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య అధికంగా ఉందని, కాలువల్లో దుర్గంధం వెదజల్లుతోందని చెప్పారు. నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్తున్నారని, అయితే పారిశుధ్యానికి సంబంధించి విఫలమయ్యారని ఆరోపించారు.

నగరంలోని కాలువలను సక్రమంగా శుభ్రం చేయడంలేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వివిధ పనుల నిమిత్తం ఈ ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారని, శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు వేలూరు మహేష్, వేలూరు రఘు, రామ్‌లక్ష్మణ్, అరవింద్, నారాయణరెడ్డి, కుమార్, అశోక్, సుబ్బారావు, జయకృష్ణ, రాజా, సుదర్శన్, రమేష్, మురళి, వెంకటేశ్వర్లు, నీలి రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు